బాలయ్య వ్యాఖ్యలకు చిరు కౌంటర్.. తన చొరవవల్లేనని స్పష్టీకరణ
posted on Sep 26, 2025 7:09AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం అంటూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. సినీ పరిశ్రమ సమస్యలపై చిరంజీవి బృందం అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలవటానికి వెళ్లినప్పుడు అవమానం జరిగిందన్న బాలయ్య.. చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్ దిగివచ్చారనడం కరెక్ట్ కాదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. టికెట్ల పెంపుపై కొందరు నిర్మాతలు నన్ను కలిశారు. సినిమా ఖర్చు పెరుగుతుండటంతో.. టికెట్లపెంపుపై ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్మాతలు కోరడంతోచొరవ తీసుకున్నానని వివరించారు.
అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లినట్లు స్పష్టం చేశారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానించారనీ.. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించి, సమయం ఇస్తే అందరం వస్తామని చెప్పానని చిరంజీవి వివరించారు. కోవిడ్ వల్ల అయిదుగురే రావాలంటే, తాము పది మంది వస్తామని చప్పాననీ, అందుకు జగన్ అంగీకరించారని అన్నారు. అప్పట్లో బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదన్న చిరంజీవి.. తాను గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది కూడా అబద్ధమేనన్నారు. సీఎం అయినా, సామాన్యుడైనా నా సహజ ధోరణిలో గౌరవం ఇచ్చి పుచ్చుకునేలా మాట్లాడతానన్నారు. అప్పట్లో తన చొరవ వల్లే టికెట్ల ధరలు పెరిగాయి చిరంజీవి పేర్కొన్నారు. ఇందుకు అక్కడున్నవారంతా సాక్ష్యులేనని వివరించారు. తాను నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాలకు టికెట్లు పెరిగాయని గుర్తు చేశారు