చిరంజీవి బర్త్ డే పై వర్మ ట్వీట్లు.. నాకు నచ్చలేదు
posted on Aug 22, 2015 5:02PM

విమర్శలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు రాంగోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఈయన ఏ విషయం గురించి మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? అది మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు గురించి. ఈ రోజు చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా అటు కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటే మరోపక్క రాంగోపాల్ వర్మకు ఇదేం నచ్చలేదట. చిరంజీవి గారికి అప్పుడే 60 ఏళ్లంటే నమ్మలేకపోతున్నాను.. చిరంజీవిని 26 ఏళ్లప్పుడు చూశాను అప్పటినుండి ఇప్పటివరకూ ఆయన అలాగే ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవికి 60 ఏళ్లు వచ్చాయని దానిని ఓ పెద్ద పండుగలా చేయడం.. 60 ఏళ్లు వచ్చాయని అందరికి తెలిసేలా చేయడం నచ్చలేదని ట్విట్ చేశారు. అంతేకాదు తన తండ్రి పుట్టిన రోజు వేడుకలను చాలా భారీగా ప్లాన్ చేసిన రాంచరణ్ పై కూడా సైటైర్ వేశారు. రామ్ చరణ్ తేజ గట్టిగా ఒత్తిడి చేసి ఈ వేడుక చేస్తున్నారా అని అన్నారు. పాపం రాంగోపాల్ వర్మకు ఈ మధ్య ఏ మేటర్ దొరకనట్టు లేదు ఆఖరికి చిరంజీవి పుట్టినరోజు మీద పడ్డారు. మరి రాంగోపాల్ వర్మ ట్వీట్లకు ఏలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
