భూసేకరణ పై పవన్ సీరియస్.. షూటింగ్ ఆపేసి మరీ



పస్తుతానికి ఏపీ భూసేకరణ విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతల నుండి  లాక్కోవద్దని చంద్రబాబును ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ట్వీట్లను పట్టించుకోకుండా శుక్రవారం ఐదు గ్రామాల పరిధిలో భూసేకరణకు రైతులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తన ట్వీట్టర్ అనే ఆయుధంతో మండిపడ్డారు. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వ్యాఖ్యలను ఉద్దేశించి తన అంతరంగాన్ని పవన్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.

"ఒక పార్టీ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీకి విధేయత చూపడంలో అర్థం ఉంటుంది.. అంతేకాని పార్టీ విధి విధానాలు దేశ ప్రయాజనాలను దెబ్బతీసేలా ఉన్నప్పుడు అది నేరానికి పాల్పడడంతో సమానమని, రాజకీయాలకు దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం కావాలని రాంజెఠ్మలానీ చేసిన వ్యాఖ్యలను ఆయన ట్వీట్ చేశారు."

 



అంతేకాదు ఏపీ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను అడ్డుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని భూములను  బలవంతంగా లాక్కుంటే సహించబోనని గతంలోనే చెప్పిన నేపథ్యంలో ఈ విషయంపై పోరాడటాని ఆయన తన సినిమా షూటింగ్ కూడా మధ్యలో ఆపేసి హైదరాబాద్ కు చేరుకున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఏపీ ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన ఐదు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు పర్యటించాలని చూస్తున్నట్టు.. ఇదే విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కూడా అదివారం నాడు పవన్ కళ్యాణ్ ను కలిసి భూసేకరణ గురించి.. ఏపీ అవసరాలను గురించి చర్చించనున్నట్టు సమాచారం. మరి ఏమవుతుందో  చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu