చింతమనేని అరెస్ట్.. లోకేశ్ ఫైర్.. 

ఏపీ టీడీపీ  ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామంటూ టీడీపీ నేత లోకేష్‌ ప్రకటించారు. ఎన్నికల్లో చింతమనేని ప్రచారానికి వచ్చివెళ్లాకా సింగారవంలో ఇరువర్గీయుల మధ్య ఘర్షణకు దిగాయి. ఈ కారణాన్ని అడ్డం పెట్టుకొని  చింతమనేనిని అరెస్ట్ చేశారని. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు హద్దు మీరుతున్నాయని నారా లోకేష్ మండిపడ్డారు. చింతమనేని అరెస్టుపై పోలీసు ల తీరును ఖండిస్తూ. తక్షణమే  ప్రభాకర్‌ను విడుదల చేయాలని  లోకేష్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్టులు సీఎం జగన్ పిరికిపంద చర్యకు నిదర్శనమని . ఓటమి భయంతోనే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని నారా లోకేష్‌ మండిపడ్డారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu