ఈ మంత్రులకి... దసరా సరదా వుండకపోవచ్చు!

తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలుగా సమైక్యాంధ్ర విభజన తరువాత రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాయి. అయితే, నవ్యాంధ్రలో టీడీపీ సర్కార్ ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జోలికి వెళ్లలేదు. ఏపీ ఫస్ట్ క్యాబినేట్ రెండున్నర ఏళ్లుగా అలానే పని చేస్తోంది. కాని, అతి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గ ప్రక్షాళనకి తెర తీయనున్నారని సమాచారం. దసరాకు అటు ఇటుగా కొంత మంది పదవులు ఊడే చాన్స్ లేకపోలేదని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. 


కొత్తగా మంత్రి పదవులు ఎవర్ని వరిస్తాయో ఇప్పుడే క్లారిటీగా చెప్పలేకపోయినా కొంత మంది పేర్లు మాత్రం పదవులు ఊడే లిస్ట్ లో వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ ఫైనల్ కాకపోయినా చాలా వరకూ కన్ ఫర్మేనని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి కిమిడి మృణాళిని పేరు వినిపిస్తోంది. అలాగే, ప్రకాషం జిల్లా మంత్రి సిద్ధా రామారావు పేరు కూడా లిస్ట్ లో వుండబోతోందని టాక్. అనంతపురం నుంచి పరిటాల సునీత, నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ కూడా మంత్రి వర్గ మార్పులు, చేర్పుల్లో భాగంగా పదువులు కోల్పోయే ఛాన్స్ వుందంటున్నారు. ఇక కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్రపై వేటు పడే వీలుందని తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu