మోడీతో ఎం మాట్లాడాలో ప్లాన్ చేస్తున్న చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో బీజేపీతో తెగతెంపులు చేసుకుంటారా..లేక వార్నింగ్ ఇస్తారా అంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు భారీ కసరత్తులు చేస్తున్నారు. ఇవాళ ఉదయం తన నివాసంలో మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని కలిసి కరువు సమస్యలు, విభజన హామీలపై చర్చిస్తారని తెలిపారు. కరువుపై ప్రధానికి ప్రజెంటేషన్ ఇచ్చి వినతిపత్రం అందజేయనున్నారు. రేపు మరోసారి ఉన్నతాధికారులతో సమావేశమై..రాష్ట్రానికి కావాల్సిన సాయంపై నివేదిక రూపొందించనున్నారు ముఖ్యమంత్రి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu