సిబీఐ ఎదుట రాజన్నపై నెపం నెట్టేసిన చేవెళ్ళ చెల్లమ్మ

చేవెళ్ళ చెల్లమ్మగా పేరుపొందిన ప్రస్తుత రాష్ట్రహోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను తాను తప్పించుకునేందుకు సిబీఐ ఇదుట దివంగత రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసి నట్లు విశ్వసనీయంగా తెలిసింది. భర్త ఇంద్రారెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ నేత రాజశేఖరరెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. చేవెళ్ళ చెల్లమ్మగా ఆమెను అభిమానిస్తూ తాను ఏ పథకాన్ని ప్రారంభించినా ముందుగా చేవెళ్ళ నుంచే ప్రారంభించేవారు. ఆమెకు పెద్దగా అర్హతలు లేకపోయి నప్పటికీ రాజ శేఖర రెడ్డి హోంమంత్రిత్వశాఖను కట్టబెట్టి విమర్శలకు కూడా గురయ్యారు. వై.ఎస్. హయాంలో ఆమె కీలకమైన భూగర్భగనుల మంత్రిత్వశాఖను కూడా నిర్వహించారు. ఈ గనుల కేటాయింపుపై విచారణ జరుపుతున్న సిబీఐ ఇప్పటికే గాలి జనార్థనరెడ్డిని, ఐఎఎస్ అధికారులైన బిపి ఆచార్య, శ్రీలక్ష్మిలను కూడా కటకటాల వెనక్కి నెట్టింది. ఈ కుంభకోణంలో సబితా ఇంద్రారెడ్డికి కూడా వాటా ఉందన్న అనుమానంపై సిబీఐ ఇటీవల ఆమెను కూడా విచారించింది. విచారణ సమయంలో ఆమె నెపమంతా రాజశేఖరరెడ్డి, శ్రీలక్ష్మీలపైనే నెట్టేసి చేతులు దులుపెసుకున్నట్లు తెలిసింది.

 

గనుల కేటాయింపునాకు సంబంధించి ప్రత్యేకంగా రెండు జి.వో.లపై తాను అభ్యంతరం తెలిపానని, అయితే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జోక్యం చేసుకుని క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలను పెట్టి వాటిని జి.వో.లుగా జారీ చేయించారని ఆమె చెప్పినట్లు తెలిసింది. దీనిపై ఏమైనా ఇబ్బందులు వతాయని తాను ఆందోళన వ్యక్తం చేయగా, క్యాబినెట్ సమావేశం తీసుకునే నిర్ణయానికి క్యాబినెట్ మొత్తం బాధ్యతా వహించాల్సి ఉంటుందని, వ్యక్తిగతంగా ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదని రాజశేఖర్ వివరణ ఇచ్చారని సిబీఐ అధికారుఅలకు సబితా ఇంద్రారెడ్డి సాక్ష్యం చెప్పినట్లు తెలిసింది. కొన్ని జి.వో.లను ఐ.ఎ.ఎస్. అధికారి తనకు చెప్పకుండానే విడుదల చేసిందని ఆమె సిబీఐ అధికారులకు చెప్పారట!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu