గంజాయి బ్యాచ్ కు డ్రోన్ లతో చెక్

తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయ్ బ్యాచ్ కు పోలీసులు డ్రోన్ లతో  చెక్ పెడుతున్నారు. పాడుబడ్డ గృహాలు, బంగళాలలో గంజాయి సేవిస్తున్న వారిని డ్రోన్ ల సాయంతో గుర్తించి కటకటాల వెనక్కు నెడుతున్నారు.

తాజాగా తిరుచానూరులో డ్రోన్ కెమేరాలతో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఓ చోట పాడుబడిన బంగళాలో గంజాయి సేవిస్తున్న నాలుగురు యువకులను అదుపులోనికి తీసుకున్నారు. గంజాయి స్థావరాలపై రోజూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu