ప్రముఖ నటుడికి ఎయిడ్స్
posted on Nov 17, 2015 9:18PM

ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ కథానాయకుడికి ఎయిడ్స్ సోకిందని, ఆ కథా నాయకుడితో సంబంధం వున్న పలువురు హీరోయిన్లకు కూడా ఆ వ్యాధి సోకిందని హాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక ప్రముఖ హీరోకి వ్యాధి సోకిందన్న పుకార్లే తప్ప ఆ హీరో ఫలానా హీరో అని మాత్రం ఎవరూ బయట పడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు చార్లీ షీన్ మీడియా ముందుకు వచ్చి తనకు ఎయిడ్స్ సోకిందని ప్రకటించాడు. అయితే తనకు ఎయిడ్స్ ఎలా సోకిందో తనకే తెలియదని చెప్పుకొచ్చాడు. తనకు ఈ ప్రాణాంతక వ్యాధి సోకిన విషయాన్ని ఇంతకాలం గోప్యంగా వుంచడానికి తాను ఎంతో ఖర్చు పెట్టానని, ఇప్పుడు ఈ విషయాన్ని తానే బహిర్గతం చేస్తున్నాను కాబట్టి ఇక ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చార్లీ చెప్పాడు. ఇంతకాలం నుంచీ ఈ రహస్యాన్ని దాచి తనకు జైల్లో వున్నట్టు అనిపించిందని, ఇప్పుడు తనకు జైల్లోంచి బయట పడినట్టు హాయిగా వుందని షీన్ చార్లీ అన్నాడు.