జర్నలిస్టులను బెదిరిస్తే తాటతీస్తాం... -‘చంద్రకళ్యాణ్’

పలువురు జర్నలిస్టుల మీద దాడి జరగడం, బెదిరింపు కాల్స్ రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. జర్నలిస్టుల మీద ఎవరైనా దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు వుంటాయని హెచ్చరించారు. అలా చేసిన వారు పాలకపక్షం వారైనా, ప్రతిపక్షం వారైనా  తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ఇకపై జర్నలిస్టులను ఇబ్బందులకు గురిచేసిన వారికి శిక్షలు కఠినతరం చేస్తామని జర్నలిస్టు సంఘాలకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu