ప్రత్యేక హోదా పై షాక్
posted on Aug 25, 2015 1:08PM
.jpg)
ఏపీ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్రమోడీ సీఎం చంద్రబాబుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, యనమల రామకృష్ణుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా సాగిన ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదా.. ప్యాకేజీ.. ఇంకా ఏపీకి కావలసిన అవసరాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేయడానికి కేంద్ర ఎప్పుడూ సహకరిస్తుందని అన్నారు. అంతేకాదు విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తామని.. ఆర్ధికంగా నష్టపోయిన ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ చెప్పారని అరుణ్ జైట్లీ చెప్పారు.
అయితే ఎంతగానో ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై మాత్రం ఇప్పుడు కూడా స్పష్టత రాలేదు. ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం మా చర్చల్లో ఉందని అరుణ్ జైట్లీ బాంబు పేల్చారు. విభజన చట్టంలోని 46, 90, 94ల పైన ప్రధానంగా చర్చించామని చెప్పారు. ఈసారి కూడా ఏపీ ప్రజల ఆశలకు భ్రేక్ పడింది. మరి ఇంకా కేంద్రం ప్రత్యేక హోదాపై చర్చలు దగ్గరే ఉంది మరి దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో.. ఒకవేళ తీసుకున్నా ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.