ఎండకి కెసిఆర్ మైండ్ బ్లాక్

 

chandrababu kcr, kcr revanth reddy, chandrababu revanth reddy

 

 

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల కేసీఆర్ ఉచ్ఛనీచాలు మర్చిపోయారని, మతిస్థిమితం కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసహనం ప్రదర్శిస్తున్నారన్నారు.


తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారు టీఆర్ఎస్ వంద సీట్ల కోసం కాదని రేవంత్ తెలిపారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లేస్తారని, మీ చేతుల్లో అదే పోస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా కేసీఆర్ భాష ఉందన్నారు. టీడీపీపై పెత్తనం చెస్తే ఓప్పుకోమని హెచ్చరించారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ ఎలా కొట్టాలో తమకు తెలుసని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.



కేసీఆర్ బుడ్డిపెట్ట బుల్లోడు...తెలంగాణతో సంబంధంలేదన్నారు. వెయ్యి మంది తెలంగాణ విద్యార్థులను పొట్టనపెట్టుకుంది 100 సీట్ల కోసమేనా అని ప్రశ్నించారు. 16 ఎంపీ సీట్లతో తెలంగాణ ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ అసలు రంగు రఘునందన్ బయటపెట్టారన్నారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగితే తెలంగాణ తీర్మానం ఎందుకు కోరలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu