బాబు ఇంటికో ఉద్యోగం
posted on Nov 6, 2014 1:00PM
.jpg)
ఏపీలో ఇంటికో ఉద్యోగమిస్తామన్న మాటను నిలబెట్టుకునే దిశగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. వేల సంఖ్యలో పోస్టులున్నట్టు గుర్తించింది. నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న తరుణంలో నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశమివ్వకుండా.. వారు విమర్శలు చేయకముందే ఉద్యోగాల నోటిఫికేషన్లను రిలీజ్ చేసేందుకు బాబు సర్కార్ రెడీ అవుతోంది. మంత్రి యనమల కూడా ఇదే మాట చెప్పారు. ఇంటికో ఉద్యోగమిచ్చి తీరుతామని భరోసా ఇచ్చారాయన. అంతేకాదు కేవలం టీచర్ల పోస్టులే పదివేల దాకా ఉంటాయని చెప్పుకొచ్చారు.
బాబు ఇంటికో ఉద్యోగమిస్తామంటే అప్పట్లో ఇతర పార్టీలు ఎద్దేవా చేశాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీలే బాబు సర్కారు ముందుకెళ్తున్న తీరును చూసి నోరెళ్లబెడుతున్నారట. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదిశగా శ్రమిస్తుంటే వణికిపోతున్నారట. ఒకవేళ నిజంగానే ఇంటికో ఉద్యోగమిస్తే ఇక తమ పని మటాషేనని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయట. మరి చంద్రబాబా.. మాజాకా..