బాంబే ఐఐటీని ఉద్దేశించి ప్రసంగించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు
posted on Oct 31, 2020 12:20PM
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈరోజు మధ్యాహ్నం ముంబై ఐఐటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. "మేనేజ్‌మెంట్ స్కూల్ అవెన్యూస్" పేరుతో ఐఐటీకి చెందిన శైలేష్ జె మెహతా అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ లో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్ సమ్మిట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మేనేజ్‌మెంట్ విద్యార్థులను ఉద్ద్దేశించి రోజుకొకరు ఆన్‌లైన్‌లో ప్రసంగించి.. వారితో ఇంటరాక్ట్ అవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మాజీ డైరెక్టర్ అనిల్ కాకోద్కర్, నీతి ఆయోగ్ వైస్ చర్మన్ అరవింద్ పనగారియా, సంపర్క్ ఫౌండేషన్ చైర్మన్ వినీత్ నాయర్ ఒక్కొక్క రోజు ప్రసంగించనున్నారు.