కేసీఆర్ మాటలు బాధపెట్టాయి..


ఏపీ ముఖ్యమంత్రిగారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారి మాటలు బాధపెట్టాయట. ఇంతకీ అంతలా కేసీఆర్ ఏమన్నారు... చంద్రబాబును అంతలా బాధ పెట్టిన మాటలు ఏంటనుకుంటున్నారా..అసలు సంగతేంటంటే.... హైదరాబాద్ లోని పార్క్ హయత్ జరిగిన ఇండియా టు డే కాన్ క్లేవ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్...తెలంగాణను ఏపీతో పోల్చవద్దని, ఏపీ కన్నా తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. ఈ మాటలే చంద్రబాబును బాధపెట్టాయట. అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు...ఏపీతో తెలంగాణను పోల్చవద్దంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ అనడం బాధాకరమని.. దక్షిణాదిన తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, ఇందుకు రాష్ట్ర విభజనే కారణమని ఆయన చెప్పారట. రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారని.. తెలంగాణను ఆంద్ర పాలకులు ధ్వంసం చేశారనడం సరికాదన్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకు ఆంద్ర ప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవలసిందేనని...ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని కూడా చెప్పారట.