పవన్, జగన్ కు ఒకేసారి కౌంటర్...
posted on Dec 14, 2017 5:41PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు... వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరోసారి కౌంటర్ ఇచ్చారు. పోలవరం విషయంలో వీరిద్దరూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరారు. ఇక దీనిపై ఈరోజు మళ్లీ స్పందించిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో పెట్టామని, వాటిని చెక్ చేసుకోవాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవిత ఆశయమని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఉన్న అపోహలు అన్నీ తొలగిపోయాయని చెప్పారు. మొత్తానికి చంద్రబాబు మాత్రం.. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బాగానే సెటైర్లు విసురుతున్నారుగా...