పవన్ గుండుపై రోజా...అది నిజమే


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ టూర్ లో చేసిన ప్రసంగాల్లో పరిటాల రవి గురించి.. తన గుండు గురించి వచ్చిన వదంతుల గురించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే అప్పటినుండి ఈ గుండు పురాణంపై ఏవరో ఒకరు... ఏదో ఒక సెటైర్ వేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా రోజా కూడా పవన్ గుండు స్టోరీ పై కామెంట్లు చేసింది. ఇప్పటికే పవన్ పై అనేక విమర్శలు గుప్పించిన రోజా...పవన్‌కు టీడీపీ గుండు కొట్టించిన మాట వాస్తవమేనన్నారు. తానప్పుడు టీడీపీలోనే ఉన్నానని, అయితే ఆ విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చిచెప్పారు. పవన్ చెప్పిన తేదీలను బట్టి చూస్తే గుండు నిజమేనని నమ్మొచ్చన్నారు. కాగా, 2014లో పవన్‌కు టీడీపీ మరోమారు గుండు కొట్టించిందని, 2019లో మళ్లీ అదే పని చేయడం ఖాయమని ఆమె సెటైర్ వేశారు. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకుని టీడీపీతో జాగ్రత్తగా ఉంటే మేలని సూచించారు. మొత్తానికి రోజా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పవన్ పై సెటైర్లు వేస్తుంది. ఎప్పుడో మళ్లీ తనపై కామెంట్లు చేసినవాళ్లందరికీ పవన్ టైం చూసుకొని రివర్స్ కౌంటర్ ఇస్తాడేమో చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu