తెలంగాణ కేబుల్ ఆపరేటర్లకు కేంద్రం నోటీసులు!!
posted on Jul 25, 2014 10:22AM

తెలంగాణ వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు రెండు టివీ చానళ్ల ప్రసారాలను నిలిపివేసిన అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ తెలంగాణలోని కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఛానళ్ళ ప్రసారం నిలిపివేయడం చట్ట విరుద్ధమని, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ నిబంధనలు, 1994లోని 16వ ఉప నిబంధన కింద మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో మూడు రోజుల్లో తెలపాలంటూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎంఎస్‌వోలకూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అలాగే ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా చానళ్లను ఎందుకు నిషేధించారో ఆగస్టు 11 నాటికి తెలపాలంటూ టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఎస్‌వోలకూ నోటీసులు జారీచేసింది.