జనగణనపై కేంద్రం గెజిట్‌ విడుదల

 

దేశంలో 16వ జనగణనకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ  గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సారి కులగణన చేపట్టనుండటంతో ప్రధాన్యత సంతరించుకుంది. జనాభ లెక్కల సేకరణ తొలిసారిగా పూర్తిగా ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ఇందు కోసం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. 

ప్రభుత్వ పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలే సొంతంగానూ వివరాలు నమోదు చేసుకోవచ్చు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని రెండు దశల్లో డిజిటల్ గా నిర్వహించి, 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ముగియనున్నది.