మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఆగ్రహం.. ఎందుకంటే?

 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని తప్పుబట్టిన టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. మంత్రి వర్గంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్‌ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడం సరికాదని మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు.  

సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి నిన్న ఖమ్మంలో చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరుపుతామని మంత్రి తెలిపారు. ఈ విషయంపై రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తామని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు.