బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే.. 

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో భారత్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ బిపిన్ రావత్ ఉన్నారు. ప్రస్తుతం భారత్‌లో అత్యశక్తివంతమైన సైనికాధికారి ఉన్న రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయిందని తెలియగానే దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. త్రివిధ దళాలు షాకయ్యాయి.  ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడుతూ మినిట్ టు మినిట్ పరిస్థితిని పర్యవేక్షించారు. సీడీఎస్ బిపిన్ రావత్ నివాసానికి వెళ్లి... ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 

బిపిన్ రావత్ భారత్ సైన్యం నిర్వహించిన కీలక ఆపరేషన్లకు సూత్రదారిగా ఉన్నారు. పాకిస్టాన్ బాలాకోట్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ కు కర్త, కర్మ,క్రియ బిపిన్ రావతే. చైనా సరిహద్దులోనూ ఆయన ఎన్నో సాహస కార్యక్రమాలు చేశారు. సరిహద్దు బలగాలకు ధైర్యంగా నిలిచారు. లద్ధాఖ్ సంక్షోభ సమయంలో బిపిన్ రావత్ త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేశారు. మూడు దళాలు బీజింగ్‌ను సమిష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో బిపిన్ పాత్ర చాలా కీలకం. భారత రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు బిపిన్ రావత్ మార్గదర్శిగా పేరు తెచ్చుకున్నారు. 

బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్‌ఫుల్ ఆర్మీ బాస్..

బిపిన్ రావత్ మంగళవారమే  ఓ వార్నింగ్ ఇచ్చారు. జీవాయుధ పోరాటానికి సన్నద్దంగా ఉండాలన్నారు. ప్యానెక్స్-21 ప్రారంభోత్స ఈవెంట్ లో పాల్గొన్న రావత్ ఓ కొత్త విషయాన్ని హైలెట్ చేయాలనుకున్నానని, కొత్త తరహా యుద్ధానికి సన్నద్దం కావాలన్నారు. ఒకవేళ జీవాయుధ పోరాటాలు ప్రారంభం అవుతున్నట్లు గమనిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు బలోపేతం కావాలన్నారు. వైరస్ లు, వ్యాధులను తట్టుకునే రీతిలో మన దేశం ప్రిపేర్ కావాలని రావత్ తెలిపారు. జీవాయుధ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపిచ్చిన మరుసటి రోజే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు. 

బిపిన్ రావత్ చివరి వార్నింగ్ ఇదే.. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu