ఆటోలో చంద్రబాబు
posted on Aug 1, 2025 4:07PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో మమేకం అయ్యే విషయంలో అన్నిహద్దలూ చెరిపేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన క్షేత్ర స్థాయిలో జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిస్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన శుక్రవారం జమ్మలమడుగులో పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన పర్యటన సాగింది.
ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించారు. జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆయన ఆటోలోనే వెళ్లారు. ఆటోలో ఆయన ప్రయాణిస్తున్నంత సేపూ ఆ ఆటోవాలాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఆ ఆటో వాలా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఆ ఆటోవాలను అధికారిక వద్దకు తీసుకువెళ్లి అతడి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. చంద్రబాబు ఆటోలో ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు ఆటో ఎక్కడంతో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.