ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ బిజీబిజీ
posted on Feb 20, 2025 1:42PM
.webp)
హస్తిన పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం (ఫిబ్రవరి 20) ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ లో భేటీ అయిన వీరు పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై చర్చించారు.
పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపునకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించాల్సిందిగా కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు హస్తిన వెళ్లిన వీరిరువురూ పనిలో పనిగా అన్నట్లుగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన నిధులు, కేంద్రం సహకారంపై చర్చలు జరుపుతున్నారు.
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వకారం కార్యక్రమంలో వీరు ఇరువురూ ప్రధాని నరేంద్రమోడీతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంంత్రి శివరాజ్ సింగ్ ఛౌహాన్ తో కూడా భేటీ కానున్నారు. ఈ తరువాత సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతారు.