పాట్నాకు చంద్రబాబు, లోకేష్.. ఎందుకంటే?
posted on Nov 18, 2025 2:14PM
.webp)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పాట్నా వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వీరిరువురికీ అందిన ఆహ్వానం మేరకు వీరు పాట్నా వెళ్లనున్నారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన బీహార్ లో పర్యటించి, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వచ్చిన ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాట్నా వెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 20వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో వారు పాల్గొని నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలియజేస్తారు.