సీబీఐ నాపై కక్ష కట్టింది కోనేరు ప్రసాద్
posted on Dec 29, 2011 12:30PM
హైద
రాబాద్ : సీబీఐ తనను వేధిస్తోందని ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడు కోనేరు ప్రసాద్ ఆరోపించారు. సిబిఐ తనపై, తన కుటుంబంపై కక్ష కట్టి వేధిస్తోందని ఆయన న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. చంచలగూడ జైల్లో ఉన్న ఆయనను గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా గాలి శనివారం తన తల్లి సంవత్సరీకం ఉందని, దీనిని వృద్ధాశ్రమం, వికలాంగ పిల్లల మధ్య జరుపుకోవాలనుకుంటున్నామని, ఇందుకోసం తనను అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. రెండు రోజుల పాటు తనకు బళ్లారి వెళ్లి రావడానికి అనుమతివ్వాలన్న గాలి పిటిషన్‌ను కోర్టు శుక్రవారం విచారించనుంది. కాగా ఆయన రిమాండ్ను న్యాయస్థానం జనవరి 12వ తేదీ వరకూ పొడిగించింది. మరోవైపు ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలకు కూడా కోర్టు జనవరి 12 వరకు రిమాండును పొడిగించింది.