అంబటి రాంబాబు.. కోరి కేసులో ఇరుక్కున్నది అందుకేనా?
posted on Jun 5, 2025 3:27PM

వైసీపీ నాయకులు అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తప్పుల కారణంగా కేసుల బారిన పడుతున్నారు. అయితే అరెస్టులు, కేసుల ద్వారా ప్రజలలో సింపతీని గెయిన్ చేయవచ్చన్న భావనతతో కేసులకు ఎదురెడుతున్నారా అన్న అనుమానం కలగక మానదు అంబటి రాంబాబు వంటి వారి తీరు చూస్తుంటే. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, కేసులు పెట్టి అరెస్టు చేస్తు న్నదనీ ప్రజలను నమ్మించడానికి కోరి మరీ కేసులకు ఎదురెడుతున్నారా అనిపించక మానదు బుధవారం (జూన్ 4) జరిగిన అంబటి ఎపిసోడ్ గమనిస్తే.
గుంటూరు పట్టాభిపురంలో వెన్నుపోటు ర్యాలీ చేస్తాం అని అంబటి రాంబాబు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు కొంతమంది వైసీపీ క్యాడర్ వచ్చిన తీరు చూసి ఇలాంటి సందర్భంలో ర్యాలీలు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని, ర్యాలీకి అనుమతి లేదని చెప్పారు పోలీసులు. దీంతో రెచ్చిపోయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై తన జులుం ప్రదర్శించారు. పోలీస్ అధికారిపై ఇష్టారీతిగా రెచ్చిపోయారు. నా ర్యాలీనే అడ్డుకుంటావా? నీకు అంత దమ్ముందా? ఏది ఆపు చూద్దాం అంటూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కేకలు వేస్తూ పోలీసు అధికారికి వేలు చూపించి బెదరిస్తూ. మీ సంగతి తెలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు చేసిన హడావిడితో, సామాన్య జనంతో పాటు, పోలీసు అధికారులు , చివరికి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కయ్యారు.
ర్యాలీకి పర్మిషన్ లేదు కదా పోలీసులు చెప్పినట్లుగా విని వెళ్లిపోతే బాగుంటుంది లేదంటే అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది అని వైసీపీ క్యాడర్ భయపడ్డారు. అంబటి రాంబాబు రెచ్చిపోవడం చూసి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన పార్టీ క్యాడర్ చాలా వరకూ జారుకుంది. ఈ విషయాన్ని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకున్నారు. అయితే అంబటి రాంబాబు మాత్రం గతంలో అధికారం ఉన్నప్పుడు ప్రజలను, పోలీసులు ను ఎలా అయితే ఓ ఆట ఆడుకున్నారో.. ఇప్పుడు కూడా అదే తరహా ఆలోచనతో పోలీసులపైనే దౌర్జన్యానికి దిగడంతో అంబటి పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు పోలీస్ అధికారులు. దీంతో గుంటూరు పట్టాభిపురం లో అంబటి రాంబాబు పై సు నమోదు అయ్యింది. యితే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనా, అంబటి పై పోలీసులు చర్యలు లేవు. మరి ఇప్పుడు పోలీసులపైనే తిరగబడిన అంబటిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.