జానకిరామ్.. ప్రమాదం జరిగిందిలా...

 

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఆకుపాముల దగ్గర వున్న అతి ప్రమాదకరమైన మలుపులో ఈ ప్రమాదం జరిగింది. కారులో డ్రైవర్ ఉన్నప్పటికీ జానకిరామ్ సఫారీ కారు నడుపుతున్నట్టు తెలుస్తోంది. కారు చాలా వేగంగా వెళ్తుండగా, ఎదురుగా రాంగ్ రూట్‌లో ఒక ట్రాక్టర్ వచ్చింది. అకస్మాత్తుగా ముందుకు వచ్చిన కారును చూసిన జానకిరామ్ కారును ఆపాలని ప్రయత్నించినప్పటికీ కారు వేగం అదుపులోకి రాలేదు. దాంతో కారు వెళ్ళి ట్రాక్టర్ని బలంగా ఢీకొంది. దాంతో జానకిరామ్ ప్రయాణిస్తున్న కారు మూడుసార్లు గిర్రుమని తిరిగి, పక్కనే వున్న గుంటలో పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు జానకిరామ్‌కి కారులోంచి బయటకి తీశారు.అయితే జానకిరామ్ అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయారు. దగ్గర్లో వున్న ఆస్పత్రికి తరలించేసరికి అప్పటికే ఆయన మరణించారు. ప్రమాదానికి గురైన కారు తీవ్రంగా ధ్వంసమైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu