వేగం ఒకడిది.. ప్రాణం మరొకడిది.. 

యాక్సిడెంట్ అంటే బైక్ కో ఓ కారు రోడ్డు మీద పడడం కాదు పరం.. ఓ కుటుంబం మొత్తం రోడ్డున పాడడం. ఓ ఊశన్న రోడ్లు జాగిలంగా ఉన్నాయని వంద, రెండొందలు గొట్టగాకు.. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా.. ? అదే నంది సన్ అఫ్ సత్యమూర్తి, అరవింద సామెత సినిమా డైలాగ్స్ ..ఎంత బాగా చెప్పాడు మహాబావులు.. ఎవరో ఎన్ని చెప్పిన మనం మాత్రం మాట వినం.. సినిమాలో ఉన్న మంచిని పక్కకు పెట్టి చెత్త విషయాల మీద మన ఫోకస్ అంత. అతివేగం ప్రాణం తీస్తుందని తెలుసు అయిన సరే ఎక్సలేటర్ తొక్కాల్సిందే.. ప్రాణాలు తీయాల్సిందే.. అదివేగం వల్ల మన ప్రాణాలే కాదు పక్కలో ఉన్న ప్రాణాలు కూడా పోతాయి అని ఆలోచించాలి. మనం ఏదైనా ఘటన నుండి  తప్పించుకోవచ్చు కానీ. ఎంత పెద్దవాళ్ళు అయిన, చిన్న వాళ్ళు అయిన. ఉన్నవాడు అయిన లేనోడు అయిన విధి రాత నుండి తప్పించుకోలేరు. విధి రాతను ఎవరు మార్చలేరూ అని అంటారు. ఈ వార్త చదివాకా..మీరు కూడా నిజమే..! అని అనుకుంటారు.  ఎందుకంటే..? ఈ ఘటన రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదల్లేదు అనే తెలుగు సామెత వంటిది. కొన్ని సార్లు తప్పు ఒకడు చేస్తే.. శిక్ష మరొకడికి పడుతుంది. కొన్ని సార్లు ఎవడో చేసిన పనికి మనం బలి అవ్వాల్సి  వస్తుంది. కానీ ఒక డ్రైవర్ చేసిన పనికి ఏం జరిగిందో మీరే చూడండి.  

ఓపెన్ చేస్తే అది ప్రకారం జిల్లా. మార్కాపురం.  అతని పేరు సూరె వెంకట కృష్ణారావు. తన తండ్రి కోటేశ్వరరావు. కోటేశ్వరావు కి కొంత కాలంగా  అనారోగ్యంగా ఉన్నాడు. ఆదివారం అద్దెకు ఓ కారు మాట్లాడుకున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకువెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. రెప్ప పాటు సమయంలో ఘోరం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా, స్వల్పంగా గాయపడిన మరొకరు కాసేపటికే గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో కారు నడుపుతున్న కటికల ప్రవీణ్‌(29) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కృష్ణారావు (34)ను మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్వల్ప గాయాలపాలైన కోటేశ్వరరావు (61) ఇంటికి వచ్చిన 10 నిమిషాలకే గుండెపోటుతో చనిపోవడంతో కారులో ప్రయాణించిన వారందరి కథా విషాదాంతమైంది. కారు దూసుకెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరికొందరికి ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కృష్ణారావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.