ప్రేమలో ఫెయిల్.. బీఈడీ విద్యార్థిని సూసైడ్.. 

అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను ప్రేమలో మోసపోయాను.  ఈ విషయంలో పోలీసులు కూడా నాకు న్యాయం చెయ్యలేదు. రక్షణ కల్పించలేదు. అందుకే నేను చనిపోతున్నాను. మీరు దైర్యంగా ఉండండి. ఇది ఒక అమ్మాయి చనిపోతూ రాసిన లేఖ.. ఇంతకీ ఏం జరిగింది..? ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది.? దానికి గలకారణాలు ఏంటో తెలుసుకుందాం..  

అది బయ్యారం మండలం. మిర్యాలపెంట పంచాయతీ, పత్యాతండా. ఆ యువతి పేరు ధరంసోత్‌ సునీత(21) వరంగల్‌లో బీఈడీ చదువుతున్న రోజుల్లో ఇదే తండాకు చెందిన మాలోతు శివ మాయమాటలతో ప్రేమలోకి దించాడు. ఆ అమ్మాయికి బతుకు మీద ఆశ కలిపించాడు. ఆమె కూడా నిజమే అనుకుంది. ఆ తరువాత ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి కాలేజీ కి వెళ్ళింది. చదువు పూర్తయ్యాక కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పాడు. 

కట్ చేస్తే.. సునీత ఏప్రిల్‌ 4న కళాశాల నుంచి  తిరిగి ఇంటికి వచ్చింది.  చాలా రోజులుగా ఉన్న సునీత శివతో మాటాడాలని కలుద్దామని ట్రై చేసింది. శివ అందుకు టైం ఇవ్వడంలేదు. శివలో వచ్చిన మార్పును గమనించి సునీత. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆమెపై అత్యాచారయత్నంతో పాటు కిడ్నాప్‌నకు యత్నించాడు శివ. ఆ విషయం పై  ఇరు కుటుంబాల మధ్య వివాదానికి దారి తీసింది. అనంతరం జరిగిన ఘర్షణలో శివతోపాటు సునీత తండ్రి బిచ్చ గాయపడ్డారు. ఇరు కుటుంబాలు ఏప్రిల్‌ 24న బయ్యారం పోలీసులను ఆశ్రయించగా విచారణ చేపట్టిన పోలీసులు సునీత తండ్రి బిచ్చపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అండగా ఉండే తండ్రి జైలుకు వెళ్లడంతో పాటు తండాలోని కొందరు కుటుంబాన్ని దూషించడాన్ని తట్టుకోలేక సునీత తీవ్ర మనస్తాపానికి గురైంది. 

ఒక వైపు  ప్రేమ వ్యవహారంలో ఎదురైన వేధింపులు,  మరో వైపు ఇరు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు. మరోవైపు ఊర్లో వాళ్ళ సూటిపోటి మాటల తో  మనస్తాపం చెందిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తన కుటుంబానికి సరైన న్యాయం చేయలేదని.. రక్షణ కనిపించడం లేదని, ప్రేమ విషయంలో మోసపోయానని.. అమ్మానాన్న క్షమించాలని, మీరు ధైర్యంగా ఉండాలని లేఖలో రాసింది. ఇదిలా ఉండగా సునీతను వేధిస్తున్న శివపై చర్య తీసుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట మృతదేహంతో ధర్నాకు యత్నించారు. పోలీసులు అడ్డుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్సై జగదీష్‌ను వివరణ కోరగా.. సునీత తండ్రిపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారించి కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రేమ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. సునీత ఆత్మహత్యపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతికి కారణమైన ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.