మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డు బ్రేక్... అత్యధిక ప్రేక్షకులు హాజరు

 

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్  రికార్డు బద్దలుకొట్టింది. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు మ్యాచ్ వీక్షించడానికి 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ చేసింది. ఇదే ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన అత్యధిక ప్రేక్షకుల రికార్డ్. 

మొత్తంగా క్రికెట్ చరిత్రలో 2022 ఐపీఎల్ ఫైనల్‍ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  ఆ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు టెస్ట్ మ్యాచ్ వీక్షించడానికి ఏకంగా 94,199 మంది క్రికెట్ అభిమానులు వచ్చారు. దీంతో గ్రౌండ్‌లో స్టాండ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అంతకుముందు ఈ మ్యాచ్‌కు 93,422 మంది ప్రేక్షకులు వచ్చినట్లు MCG గ్రౌండ్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.

 ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది అభిమానులు పెరిగినట్లు ప్రకటించింది.కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించడానికి 93,013 మంది అభిమానులు వచ్చారు. ఆ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్ట్ అధిగమించింది. ఇదే కాకుండా 2013లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టుకు కూడా భారీ సంఖ్యలో (91,112 మంది) క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.

 MCG మొత్తం సామర్థ్యం 1,00,024. మరోవైపు, క్రికెట్ గ్రౌండ్లలో అత్యధిక మంది ప్రేక్షుకులు హాజరైన రికార్డ్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ఏకంగా 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షుకులు వచ్చిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.

ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu