కల్తీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ

 

నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీ కోరుతూ తంబళ్లపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగగా.. ఐదుగురు నిందితులను మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కోర్టు అనుమతి మేరకు ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ 28 తాండ్ర రమేష్, ఏ 27తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఏ 29 షేక్ అల్లబక్షులను శుక్రవారం (ఈ నెల 26) ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు వారిని తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu