మమతా కులకర్ణికి చిప్పకూడు
posted on Nov 13, 2014 1:29PM

కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించిన బెంగాలీ, బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణని, ఆమె భర్త విక్కీ గోస్వామిని కెన్యా పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. కెన్యాలోని డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మొంబాసా పోలీసులు కలిసి వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మమతా కులకర్ణి హీరోయిన్ కెరీర్ కొద్దికాలమే సాగింది. ఆ తర్వాత విక్కీ గోస్వామితో కలసి ఆమె దుబాయ్‌కి వెళ్ళిపోయారు. విక్కీ గోస్వామి డ్రగ్స్ డీలర్. మమతా కులకర్ణి, విక్కీ గోస్వామి కొంతకాలం దుబాయ్‌లో హోటళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. విక్కీ గోస్వామిని దుబాయ్లో 1997లో డ్రగ్స్ కేసులో అరెస్టుచేసి, 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. సత్ప్రవర్తన కారణంగా విక్కీ గోస్వామిని గత నవంబర్ 15న విడుదల చేశారు. ఆ తర్వాతే వీళ్లిద్దరూ కలిసి నైరోబీకి వెళ్ళారు. అక్కడ మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తుండగా పోలీసులు ఈ భార్యాభర్తల్ని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.