సుజనా చౌదరికి అపూర్వ స్వాగతం
posted on Nov 13, 2014 1:14PM

కేంద్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం తెలుగుదేశం ఎంపీ, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి మొదటిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి బాధ్యతలలో తలమునకలుగా వున్నప్పటికీ తాను ప్రతి రెండో, నాలుగో శనివారాల్లో కార్యకర్తలకు అందుబాటులో వుండి వారి సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తనమీద చేస్తున్న ఆరోపణల గురించి ఆయన ప్రతిస్పందిస్తూ తనమీద ఆరోపణలు చేసేవారెవరైనా తమ ఆరోపణల మీద విచారణ కూడా జరుపుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి వచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.