శ్రీదేవి మా అమ్మ కాదు.. మా నాన్న రెండో భార్య..అంతవరకే..
posted on Aug 4, 2014 3:21PM

చాలామంది టాప్ హీరోయిన్లు ఎవరికో ఒకరికి రెండో భార్యగానే సెటిలయ్యారు. అదో బ్యాడ్ లక్. దక్షిణాదిలో, ఉత్తరాదిలో దుమ్ము దులిపిన శ్రీదేవి కూడా బోనీ కపూర్‌కి రెండో భార్యే. బోనీకపూర్‌తో ఆమె సంసారం చక్కగా సాగుతోంది. అందంలో శ్రీదేవితో పోటీ పడలేకపోయినప్పటికీ బంగారం లాంటి ఇద్దరు ఆడపిల్లలు కూడా వున్నారు. అంతా బాగానే వుంది. అయితే బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మాత్రం సవతి తల్లి అయిన శ్రీదేవిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వుంటాడు. తన తండ్రిని శ్రీదేవి హైజాక్ చేసిందని అర్జున్ అభిప్రాయపడుతూ వుంటారు. శ్రీదేవికి, అర్జున్‌కి మధ్య సయోధ్య కుదర్చడానికి గతంలో బోనీ కపూర్ ప్రయత్నించి అది కుదరకపోవడంతో చేతులెత్తేశాడు. తాజాగా అర్జున్ కపూర్ మరోసారి శ్రీదేవి మీద తన కోపాన్ని బహిర్గతం చేశాడు. శ్రీదేవి ఎప్పటికీ మా నాన్న బోనీ భార్యే, అంతకుమించి మా మధ్య బంధం లేదు.. ఆమె నాకు తల్లి కాదు అంటూ అర్జున్ మరోసారి చెప్పాడు. శ్రీదేవితో తన అనుబంధం ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశాడు.