అమీర్ ఖాన్ ‘పీకే’ పోస్టర్ కాపీ అట!!
posted on Aug 4, 2014 3:28PM
.jpg)
బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ సినిమాలు సొంత క్రియేటివిటీతో రూపొందిస్తారన్న అభిప్రాయం ఇండియాలో వుంది. సినిమాల విషయం ఏమోగానీ, ఆయా సినిమాల పోస్టర్లు మాత్రం కాపీ పోస్టర్లన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాజాగా అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా వాల్ పోస్టర్ వార్తల్లో నిలిచింది. అమీర్ ఖాన్ బట్టల్లే కుండా నిల్చుని, ఆచ్ఛాదన కోసం ఒక టేప్ రికార్డర్ని పెట్టుకుంటాడు. అయితే ఈ పోస్టర్ అసభ్యకరంగా వుందంటూ ఇప్పటికే ఒక కేసు నమోదైంది. దీంతోపాటు ఈ పోస్టర్‌కి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. 1973 సంవత్సరంలో క్విమ్ బారియోరోస్ అనే పోర్చుగీస్ సంగీత కళాకారుడు తన మ్యూజిక్ ఆల్బమ్ కోసం రూపొందించిన పోస్టర్ని కాపీకొట్టీ ‘పీకే’ పోస్టర్ రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విమర్శకులు తమ విమర్శలకు బలం చేకూర్చడానికి 1973 నాటి పోస్టర్‌ని కూడా సాక్ష్యంగా చూపిస్తున్నారు.