ఏపీ భవన్ కు బాంబు బెదరింపు
posted on May 3, 2025 1:04PM
.webp)
ఢిల్లీలోని ఏపీ భవన్‌కు నిన్న రాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. ఏపీ భవన్‌లోని ఆడిటోరియంలో బాంబు పెట్టామంటూ ఆమెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్‌కు మెయిల్ చేశాడు. ఈ మేరకు ఈమెయిల్ చేశాడు. సరిగ్గా ఏపీ భవన్ లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఫూలే జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినీమా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఈమెయిల్ వచ్చింది. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు సినీమా ప్రదర్శన ఉండగా.. అంతకు కొద్ది సేపటి ముందు ఈ ఈమెయిల్ వచ్చింది.
లవ్ అగర్వాల్ ఈ మెయిల్ వచ్చిన సమయంలో ముంబైలో ఉన్నారు. వెంటనే ఏపీ భవన్ అధికారులు, పోలీసులకు ఆయన సమాచారం అందించి అప్రమత్తం చేశారు. దీంతో ఏపీ భవన్ లో భద్రతా విధులు నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించిన తరువాత బాంబు లేదని తేల్చారు.