కాంగ్రెస్ ని వణికిస్తున్న నల్లకుబేరులు..!

నల్లకుబేరుల జాబితాను కేంద్రం సుప్రీం కోర్టుకు సమర్పించింది. ప్రజా సంక్షేమమే మెయిన్ ఎజెండాగా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కార్ సుప్రీంకు 627 మందితో కూడిన నల్లకుబేరుల జాబితాను సమర్పించింది. దీంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎందుకంటే నల్ల కుబేరుల జాబితాలో ఎక్కువగా కాంగ్రెస్ వారే ఉన్నారని చాలాకాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రం కాంగ్రెస్ నల్లకుబేరుల పేర్లను బయట పెడితే పార్టీ పరువు బజారున పడడం ఖాయం.

అసలే వరుస వైఫల్యాలతో బొక్కా బొర్లాపడ్డ హస్తానికి ఇది మింగుడుపడడం లేదు. అందుకే సోనియా గాంధీ ఇప్పటికే పార్టీ నేతలకు జాగ్రత్తగా ఉండమని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ పేర్లు ఎవరివైనా బయటికొస్తే వారిని వెంటనే సస్పెండ్ చేసి.. వారికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ముందే వివరణ ఇవ్వాలని ఇప్పటికే చెప్పేశారని ప్రచారం జరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్  ఏం చేసినా ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఎవరూ కాపాడలేరని విశ్లేషకులు చెబుతున్నారు. సో నల్లకుబేరుల పేర్లు బయటికొస్తే కాంగ్రెస్ కొంప కొల్లేరు కావడం ఖాయమంటున్నారు.