బ్లాక్ మనీని పట్టేందుకు కొత్త వ్యవస్థ
posted on Jan 24, 2016 5:07PM

ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీల్లో కీలకమైనది,విదేశాల నుంచి నల్లధనం వెనక్కి రప్పించడం..ఈ విషయంలో ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై, ప్రతిపక్షాలు విమర్శల్ని గుప్పిస్తున్నాయి..తాజాగా బ్లాక్‌మనీ వెలికి తీసే విషయంలో స్విస్ బ్యాంక్ పూర్తి స్థాయిలో భారత్‌కు సహకరిస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. భారత్-స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రులు ద్వైపాక్షిక్ష భేటీలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ ఇక నుంచి స్విస్ బ్యాంకులో నగదు జమ చేసే వారి సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలిసేలా నూతన వ్యవస్థను, నిబంధనలను తీసుకురానున్నట్లు వివరించారు. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా,స్విస్ బ్యాంక్ ఖాతాల్లో జమయ్యే భారతీయుల డబ్బుకు సంబంధించిన అన్ని వివరాలూ క్లియర్ గా తెలుస్తాయి..ఇప్పటికే తాము భారత్‌కు పూర్తి సహకారం అందించేందుకు ముందుకు వచ్చామని, భవిష్యత్తులో ఇది కొనసాగుతుందని అని స్పష్టం చేశారు స్విట్జర్లాంట్ ఆర్ధిక మంత్రి యులి మౌరర్.ఇలాంటి వ్యవస్థ మొదలైందని ప్రకటించిన తర్వాత కూడా, నల్లధన కుబేరులు తమ ధనాన్ని అక్కడ జమ చేస్తారా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..