పౌరసత్వ కార్డులెందుకు.. కరెంటు ముఖ్యం...
posted on Oct 9, 2014 9:44AM
.jpg)
తెలంగాణ ప్రజలకు ఇప్పుడు కావలసింది గుర్తింపు కార్డులు కాదని... కరెంట్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్. రామచంద్రరావు అన్నారు. ఫాస్ట్ పథకంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగోరే విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఈ నెల 15వ తేదీలోగా.. కేవలం 6 రోజుల వ్యవధిలో పొందాలని సూచించడం, ఈ కార్యక్రమాన్ని ఈ గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయడం సబబు కాదన్నారు. మొన్న సమగ్ర సర్వే, నిన్న ఫాస్ట్, నేడు గుర్తింపు కార్డులు అని కేసీఆర్ ప్రజలను పరేషాన్ చేస్తున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుర్తింపు కార్డుల గురించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పౌరులకు గుర్తింపు కార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు? ఒకవేళ తెలంగాణ ప్రజలకు మాత్రమే అయితే తెలంగాణలోని తెలంగాణేతరుల సంగతేంటని రామచంద్రారావు ప్రశ్నించారు. పరిశ్రమలకు వారంలో రెండు రోజులపాటు కరెంటు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఈ నెల 11, 13, 14 తేదీలలో మండల కేంద్రాల్లో బీజేపీ ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన వివరించారు.