మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ జోరు

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 స్థానాలు, హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ మొదలైంది. మధ్యాహ్నం 4 గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ ముందంజలో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి. మహారాష్ట్రలో మొదటి స్థానంలో బీజేపీ, రెండవ స్థానంలో శివసేన దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు చతికిల పడ్డాయి. హర్యానాలో బీజేపీ ముందంజలో ఉండగా, మిగతా పార్టీలు వెనుకంజలో ఉన్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu