కోపంలో కానిస్టేబుల్‌ ని కారుతో గుద్దిన బీజేపీ నేత!!

 

తన కారును ఆపాడన్న కోపంతో కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడో బీజేపీ నేత. వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని రేవారీకి చెందిన బీజేపీ నేత సతీశ్ ఖోడా.. 'అధికారం మనది మనల్ని ఆపేది ఎవరు' అన్నట్టుగా తన కారులో రాంగ్ రూట్‌లో దూసుకెళ్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ రాంగ్ రూట్ లో కారు రావడం గమనించి.. కారును ఆపాలని సూచించాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సతీశ్ అతడిని తన కారుతో ఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు. కారు బానెట్‌పై పడిన కానిస్టేబుల్‌ను దాదాపు 300 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కారు ఆపడంతో కానిస్టేబుల్ బయటపడ్డాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu