మాయవతిని కుక్క అన్న బీజేపీ నేత...

బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ మరోసారి బీఎస్పీ అధినేత్రి మాయావతిపై నోరు పారేసుకున్నారు. ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాయావతి ఓ కుక్క లాంటిదని, డబ్బు వెనుకాలే పరిగెడుతుంటుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఓ అత్యాశ గల మహిళ..బైకు వెంట ఓ కుక్కలా పరిగెత్తుతూ అరుస్తుంటుంది, కానీ బైక్ ఆపితే మాత్రం..తోక ముడుచుకుని వెనక్కు వెళ్లిపోతుందన్నారు. అంతకు ముందు మాయావతి వేశ్య కంటే హీనమంటూ..తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈ వ్యవహారంలో దయాశంకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu