ఎన్సీపీతో చర్చలకు సిద్ధమైన శివసేన.......

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంద ని అనుకున్నారంతా. ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపి శివసేనకు మధ్య సయోధ్య కుదరకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు. శివసేన నేతల నుంచి రోజుకో ప్రకటన రావడంతో మహా రాజకీయల్లో మహా ప్రతిష్టంభన నెలకొంది. ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకొమని బిజెపి చెప్పడంతో శివసేన ఇతర పార్టీల వైపు చూపు తిప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు సీట్లు సాధించిన భాజాపా తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా శివసేన సవాల్ విసిరింది. అలా జరగని పక్షంలో ఎన్సీపీ కాంగ్రెస్ తో కలిసి రెండో అతి పెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుందని పరోక్షంగా బిజెపిని హెచ్చరించింది.

ప్రజల కోరిక మేరకు ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటిస్తూ వచ్చిన ఎన్సీపీ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే  శివసేనతో పొత్తుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది. ఇదే విషయమై చర్చించేందుకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు శరద్ పవార్. అటు రాష్ట్ర తాజా రాజకీయ పరిణామా లను ఫడ్నవీస్ హోమంత్రి బిజెపి అధినేత అమిత్ షాను కలిసి వివరించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీతో చర్చలు జరిగితే అది సీఎం పదవిపైనే జరుగుతాయని శివసేన స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలేవీ జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతి నిధి సంజయ్ రౌత్ అన్నారు. తాజా పరిస్థితుల్లో ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కు సంజయ్ రౌత్ సందేశం పంపించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆ సమయంలో ఓ సమావేశంలో ఉండడంతో సంజయ్ రౌత్ తో మాట్లాడలేకపోయానన్న అజిత్ పవార్ త్వరలోనే ఆయనతో ఫోన్ లో సంభాషించి వివరా లు తెలుసుకుంటానన్నారు.

శివసేనతో పొత్తు పెట్టుకోవాలా లేదా అనేది శరద్ పవార్ నిర్ణయిస్తారని అజిత్ తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబరు ఏడుతో ముగిసిపోనుంది, ఈలోగా ప్రభుత్వ ఏర్పాటు జరగాలి లేదంటే అది రాష్ట్రపతి పాలనకు దారితీసే అవకాశముంది. రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ లో నూట ఐదు సీతతో బిజెపి పెద్ద పార్టీ గా అవతరించిన మెజారిటీ మాత్రం సాధించలేదు. ఇంకా నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది. యాభై ఆరు సీట్లతో శివసేన రెండో పెద్ద పార్టీ గా నిలవగా తర్వాతి స్థానాల్లో ఎనసిపి యాభై నాలుగు సీట్లతో కాంగ్రెస్ నలభై నాలుగు సీట్లతో ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో పార్టీల మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారన్నది కీలకంగా మారింది.