మనుషుల్లోనూ వ్యాప్తి చెందుతున్న బర్డ్ ఫ్లూ..ఏలూరు జిల్లాలో ఒకరికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కోళ్లు, పక్షులే కాకుండా మనుషులకు సైతం సోకుతోంది. బర్డ్ ఫ్లూ చాపకింద నీరులా అతి వేగంగా విస్తరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలలో తీవ్ర భయందోళనలు వ్యక్తం అవుతున్నాయి.  ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో సర్వత్రా తీవ భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

బర్డ్ ఫ్లూ ఒక వ్యక్తికి కూడా సోకినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. బర్డ్ ఫ్లూ కు సంబంధించి సమాచార సేకరణ, మెడికల్ క్యాంపుల నిర్వహకణ వంటి చర్యలు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కేంద్రంగా జరుగుతాయి.  ఏలూరు జిల్లా పరిధిలో ఎక్కడ కోళ్లు చనిపోతున్నా 9966779943 నంబర్‌కు సమాచారాన్ని అందించాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో కోళ్ల పెంపకానికి ప్రసిద్ధి చెందిన ఉంటుటూరు మండలంలోని వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతంలో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. బర్డ్‌ ఫ్లూ వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్సలు అందించేంకు అసవరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu