ఫ్రెండ్ చనిపోయాడని ఆత్మహత్య చేసుకున్న ఫ్రెండ్..
posted on Sep 28, 2016 12:38PM

తన ఫ్రెండ్ ప్రమాదంలో చనిపోయాడన్న బాధను తట్టుకోలేక ఓ యువకుడు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాలోని కారంపూడి మండలం వేపకంపల్లి గ్రామానికి చెందిన రమేష్, హరికృష్ణ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారు ఈరోజు తెల్లవారుజామున బైక్‌పై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెనక కూర్చున్న రమేష్ యువకుడు మృతి చెందాడు. అయితే దీనికి మనస్తాపం చెందిన హరికృష్ణ.. రమేష్ చనిపోయిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ మరణాన్ని తట్టుకోలేక భరత్‌నగర్‌లో రైలు పట్టాల దగ్గరకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా హరికృష్ణ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రమేష్ శ్రీ శ్రీ హోలిస్టిక్ ఆసుపత్రిలో ఉద్యోగి.