నితీష్‌కి అభినందనల వెల్లువ
posted on Nov 8, 2015 2:25PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్ నాయకత్వంలోని మహా కూటమి ఘన విజయం సాధించి, నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కానుండటంతో దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల నుంచి నితీష్ కుమార్‌కి అభినందనలు అందుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే రాజకీయ శక్తులు నితీష్‌ని అభినందనల్లో ముంచెత్తుతున్నాయి. నితీష్ విజయం బీజేపీ దూకుడుకు కళ్ళెం వేస్తుందని కొందరు, నితీష్ విజయం ముందే ఊహించామని మరికొందరు అభినందిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నితీష్‌కి అభినందన సందేశం పంపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నితీష్‌కి ఫోన్ చేసి మరీ అభినందించారు. తమిళనాడు నుంచి స్టాలిన్ కూడా నితీష్‌కి అభినందన సందేశం పంపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ఫలితాల ద్వారా అయినా బీజేపీకి జ్ఞానోదయం కలగాలని కోరుకున్నారు.