ఏం నేను రాకూడదా..మోడీ
posted on Nov 2, 2015 3:47PM

ప్రధాని నరేంద్ర మోడీ లాలూ, నితీష్ కుమార్లపై విమర్శల వర్షం కురింపించారు. బీహార్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. బీహార్ ను ఒకటి కాదు రెండు కాదు 25 ఏళ్లు పాలించారని.. 25 ఏళ్లలో ఏం చేశారని.. బీహార్ కు ఏమిచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారో లాలూ, నితీష్ కుమార్ ఆలోచించుకోవాలని.. బీహార్ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రస్తుత పాలనపై బీహార్ మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. బీహార్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లాలుకి, నితిశ్ కుమార్ కు ఉందని అన్నారు. బీహార్ లో అటవిక పాలన నడుస్తోందని విమర్శించారు. తాను బీహార్‌కు వస్తుంటే మహాకూటమి నేతలు విమర్శిస్తున్నారని... తాను బీహార్‌కు రాకూడదా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయమని జోస్యం చెప్పారు.