జీహెచ్ఎంసీ ఎన్నికలు.. అందుకే కేసీఆర్ గడువు అడిగింది..శశిథర్ రెడ్డి


జీహెచ్ఎంసీ ఎన్నికల జాప్యంపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని.. గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అడిగిన గడువు నేపథ్యంలో కాంగ్రెస్ నేత మర్రి శశిథర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం గడువు కోరడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. హైదరాబాద్ లో మొత్తం 30 శాతం మంది సీమాంధ్రులు ఉన్నారు.  కాబట్టి వారు సంక్రాంతి పండుగ సందర్బంగా ఊర్లు వెళ్లి 10 నుండి 20 రోజుల వరకూ అక్కడే ఉంటారు. ఈ కారణంగా జనవరి 31 లోపు ముఖ్యంగా సంక్రాంతికి ఎన్నికలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం చూస్తుందని.. అప్పుడైతే సీమాంధ్ర ప్రజలు వారి వారి స్వస్థలాలకు వెళతారు కాబట్టి వాళ్లు ఓట్లు వేసే అవకాశం ఉండదు.. దీంతో కేసీఆర్ కు కొంత నష్టం తగ్గుతుందని భావించి అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని అన్నారు. చూడబోతే శశిథర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా కొంత నిజముందనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu