బీహార్ లో బీజేపీ బీసీ ప్రయోగం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో బీజేపీ కొత్త ఎత్తువేసింది, రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో కొంచెం ఇబ్బంది పడుతున్న బీజేపీకి బూస్టింగ్ ఇచ్చేలా కేంద్ర నాయకత్వం కీలక ప్రకటన చేసింది, బీహార్ లో ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామంటూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. రిజర్వేషన్లపై మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని ప్రత్యర్ధి పార్టీలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు ప్రజల్లోకి వెళ్తుండటంతో జాగ్రత్తపడిన బీజేపీ ఈ విధాన ప్రకటన చేయాల్సి వచ్చింది, దాంతో నితీష్, లాలూ ప్రచారాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టినట్టయింది. అన్ని సర్వేల్లోనూ
ముందున్న బీజేపీకి ఈ బీసీ మంత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి

Online Jyotish
Tone Academy
KidsOne Telugu