వందల మంది మెడలో పాములు

 

పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి ఎవరైన భయాపడుతారు.. అలాంటిది విషపూరిత సర్పాల జోలికి వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే కొందరు వ్యక్తులు పాములతో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. ఇళ్లలోకి, జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని కాపాడుతుంటారు. 

బిహార్ సమస్తిపూర్లోని సింధియా ఘాట్‌లో వందల మంది యువకులు నాగుపాములను మెడలో వేసుకొని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరలవుతోంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగ పంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే, గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu